శృంగారంలో నిర్లక్ష్యం చేసేవారికి అలర్ట్

147723చూసినవారు
శృంగారంలో నిర్లక్ష్యం చేసేవారికి అలర్ట్
మహిళలు గర్భం దాల్చడానికి మగాడి వీర్యం ఓ ముడి పదార్థం లాంటిది. పురుషుల వీర్యం క్వాలిటీగా ఉంటేనే అది గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది. క్వాలిటీగా లేదంటే ఎంత కాలం శృంగారంలో పాల్గొన్నా.. మహిళలకు గర్భం రాదు. అందుకే మగవాళ్లు వీర్యనాణ్యతను మెరుగుపరుచుకుంటే పెళ్లి తర్వాత వచ్చే ఎలాంటి సమస్యలు రావు.

చాలా రోజులుగా సంసార జీవితాన్ని గడుపుతున్నా.. భార్య గర్భం దాల్చకపోతే వెంటనే ఆ జంట గైనకాలజిస్ట్ ను కలవాలి. అక్కడ భార్యాభర్తలిద్దరికీ టెస్టులు చేస్తారు. పురుషుడికి సంబంధించి స్మెర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల నుంచి 200 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఆ స్థాయిలో కౌంట్ ఉంటేనే ఆ వీర్యం గర్భం దాల్చడానికి పనికొస్తుంది. లేకుంటే డాక్టర్ చెప్పే సూచనలు, సలహాలు పాటించాలి. అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా ఇస్తారు. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను తినడం స్టార్ట్ చేయాలి. వీర్య నాణ్యతను అవే వృద్ధి చేస్తాయి. పురుషుల వీర్య నాణ్యతను పెంచే ఆ ఆహార పదార్థాలేవో ఇప్పుడు చూద్దాం.

బచ్చలి కూర: ఆకుకూరలు మగాళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల స్పెర్మ్ క్వాలిటీని సంరక్షిస్తుంది. వారానికి రెండు సార్లయినా బచ్చలికూరను ఏదో ఒకరూపంలో తీసుకోవడం మంచిది.

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లోని విటమిన్స్, పురుషుల దేహంలోని టెస్టోస్టిరాన్ శాతాన్ని అదుపులో ఉంచేలా చేస్తాయి. అంతేకాకుండా స్మెర్మ్ కౌంట్ ను, వీర్య నాణ్యతను పెంచేందుకు పనికొస్తాయి.

డార్క్ చాకొలెట్స్: డార్క్ చాకొలెట్స్ లో అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది.

అరటికాయలు: రోజూ ఒక అరటిపండును తినడం మగాళ్లకు ఎంతో మంచిది. అరటిపళ్లల్లో ఉండే ఏ, బీ1, సీ విటమిన్లు స్పెర్మ్ సెల్స్‌ను బలోపేతం చేస్తాయి. అలాగే వీర్య నాణ్యతను పెంచేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

గుడ్లు: గుడ్లను ఫ్రై, ఆమ్లెట్ల రూపంలో గుడ్లను తినే బదులుగా వాటిని ఉడకబెట్టుకుని తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మ: దానిమ్మ గింజల్లో సహజంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ క్వాలిటీని పెంచేందుకు దోహదపడతాయి. వీటిని నేరుగా తినడంతో పాటు జ్యూస్ చేసుకుని తాగినా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఆరెంజ్: ఈ పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్‌ ను పెంచడతో పాటు వీర్యకణాల కదలికలను యాక్టివ్ గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటు టమోటాలు, క్యాబెజీ, బ్రోకోలీల్లో కూడా విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా కుర్రాళ్లు తమ డైట్‌లో చేర్చుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్