ప్రముఖ కన్నడ నటి, యాంకర్ అపర్ణ వస్తారే తాజాగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు. సిగరెట్ తాగని వారికి సైతం ఇది వ్యాపిస్తోంది. స్వరంలో మార్పు, అలసట, బలహీనత, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, మందులు వేసుకున్నా తగ్గని దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం ఉమ్మివేయడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, అతినిద్ర, బరువు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముందుగానే వైద్యుడిని సంప్రదిస్తే, తగిన చికిత్సతో దీని నుంచి బయటపడొచ్చు.