దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ఎన్డీయే కూటమి 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 9, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 1, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి ఒక సీటు దక్కింది. దీంతో బీజేపీ బలం 96కి చేరుకుంది, కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. మరో సీటు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష ఇండియా కూటమి సంఖ్య 85కి చేరుకుంది.