పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గట్టి షాకిచ్చింది. తమను సంప్రదించకుండా పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శించే షెడ్యూల్ ప్రకటించడం.. వివాదాస్పద పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని నగరాలను అందులో చేర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. శనివారం విడుదల చేసిన ట్రోఫీ ప్రదర్శన షెడ్యూల్ నుంచి పీవోకేలోని నాలుగు నగరాలను తొలగించి తాజా షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది.