సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. ఆయన కాసేపటి క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చారు. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో పోలీసులు దాదాపు 50కి పైగా ప్రశ్నలని అడిగినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.