చలికాలంలో బోన్ సూప్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మటన్ ఎముకలు, మజ్జ, టెండాన్లు, చర్మం, లిగమెంట్లను ఎక్కువ సమయం పాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు వస్తాయి. అలాంటి సూప్‌ను తాగితే మనకు పోషకాలు లభిస్తాయి. దీనిలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండటంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ మరింత బలపడుతుంది.