ఫుల్లుగా తాగిన యజమానిని ఇంటికి తోలుకెళ్లిన ఆంబోతు (VIDEO)

51చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆంబోతుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సదరు వ్యక్తి మద్యం మత్తులో సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలుతూ కనిపించాడు. అయితే, అతడి వెనకే ఉన్న ఓ ఆంబోతు అతడిని వెనక నుంచి మెల్లగా తోస్తూ సరైన దారిలో నడిపించింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి షాకైపోయారు. ‘గేదెలను మనుషులు తోలుకెళ్లడం చూశాం గానీ మనిషిని ఓ ఆంబోతు తోలుకెళ్లడం ఎప్పుడూ చూడలేదు’ అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్