గ్రూప్ టాపర్‌గా అమెరికా.. పాక్‌కు ఝలక్?

78చూసినవారు
గ్రూప్ టాపర్‌గా అమెరికా.. పాక్‌కు ఝలక్?
తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న USA రెండు మ్యాచుల్లోనూ గెలిచి ప్రస్తుతం గ్రూప్-ఏ టాపర్‌గా ఉంది. ఆ తర్వాత భారత్, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. PAKపై గెలుపుతో USAకు సూపర్8పై ఆశలు చిగురించాయి. ఆ జట్టుకు భారత్, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లున్నాయి. భారత్‌తో ఓడినా.. ఫామ్‌లో లేని ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అదే జరిగితే IND, USA సూపర్8 వెళ్లొచ్చు. పాక్ గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించక తప్పదు.

సంబంధిత పోస్ట్