పీరియడ్ నొప్పులు తగ్గడానికి ఎక్కువ మందులు వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి

1083చూసినవారు
పీరియడ్ నొప్పులు తగ్గడానికి ఎక్కువ మందులు వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు 18 ఏళ్ల యువతి ఎక్కువ మాత్రలు వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. 'యువతి ఆగస్టు 21న పీరియడ్ పెయిన్ రిలీఫ్ మందులు వాడింది, ఆ తర్వాత వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స అనంతరం డిశ్చార్జి చేయగా స్పృహ కోల్పోయి చికిత్స పొందుతూ మృతి చెందింది' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్