రైలు ఇంజిన్‌ - బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి

72చూసినవారు
రైలు ఇంజిన్‌ - బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
ఉత్తరప్రదేశ్‌‌లోని బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల రైలు ఇంజిన్‌ - బోగీల మధ్య కప్లింగ్‌ విడదీసేందుకు యత్నించిన రైల్వే పోర్టర్‌ మృతి చెందాడు. కప్లింగ్‌ విడదీస్తున్న సమయంలో ఇంజిన్‌ ఒక్కసారిగా వెనక్కురావడంతో అక్కడే ఇరుక్కుపోయి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కాగా, ఘటనానంతరం లోకోపైలట్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్