పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు అధికార, విపక్ష నేతలు తేనీటి విందులో పాల్గొన్నారు. అనధికారికంగా జరిగిన భేటీలో మోదీ, రాహుల్ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. సభలో ఉప్పూనిప్పూగా ఉండే ఈ అగ్రనేతలిద్దరూ ఇలా ఒకేచోట కూర్చున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.