పాకిస్థాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఆ దేశస్థులకు వీసా జారీ ప్రక్రియను బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం సరళతరం చేసింది. పాక్ ఉన్నతాధికారులకు వీసాల జారీకి ఇప్పటిదాకా ఉన్న ‘ఢాకా నుంచి ఆమోదం’ నిబంధనను తొలగించారు. లాహోర్‌లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొన్న వ్యాపారరంగ ప్రముఖులకు పాక్‌లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇక్బాల్ హుసేన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.