శ్రీవారి పుష్కరిణిలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పండితులు వివరించారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారన్నారు.