ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇద్దరు లాయర్ల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఓ కేసు విషయంలో ఓ మహిళా న్యాయవాది, ఓ పురుష న్యాయవాది మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మహిళా లాయర్.. పురుష లాయర్ కాలర్ పట్టుకుని నానా హంగామా చేసింది. అతడిని చెంపదెబ్బ కూడా కొట్టింది. దీంతో ఆగ్రహించిన లాయర్, అతడి తరఫు వారు ఆమెపై దాడికి దిగారు. తీవ్రంగా కొట్టడంతో ఆమెకు రక్తస్రావం అయింది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.