AP: కడపలో శుక్రవారం జరిగిన దారుణమైన ఘటన మరువకముందే చిత్తూరు జిల్లా శాంతిపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని మునుస్వామి అనే వ్యక్తి తన సొంత భార్య అయిన మంగమ్మను ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మునుస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.