యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. హమీర్‌పూర్ జిల్లా సుమేర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెధా గ్రామానికి చెందిన రాజేశ్ (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, అత్తల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వీడియో తీస్తూ శుక్రవారం సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.