రివ్యూ రాసే వారిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. తన మాటలు పలువురిని బాధపెట్టాయని, త్వరలోనే వారికి క్షమాపణలు చెబుతా అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 'పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ లో నేను కొన్ని మాటలు మాట్లాడాను. దాంతో కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలో మీ అందరికి కరెక్ట్ విషయాల మీద భేషరతుగా క్షమాపణలు చెబుతా. దయచేసి వేచి ఉండండి' అంటూ చెప్పుకొచ్చారు.