ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో బీజేపీ నాయకులకు పోలీసులు దగ్గరుండి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజల భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. కాగా ఆప్ ర్యాలీలకు అవాంతరాలు సృష్టించాలని హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ విషయాన్ని ఓ ఎస్సై తనకు చెప్పినట్లు కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.