వీళ్ళు మనుషులేనా.. ఆడ శిశువును ఎండలో పడేసి వెళ్లారు(వీడియో)

1563చూసినవారు
HYD పటాన్‌చెరులో ఈరోజు అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఈ మేరకు పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ పరిధిలోని లాలాబాయి కాలనీలో అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఎండ వేడిని తట్టుకోలేని ఆ పసి ప్రాణం ఏడుస్తుండటంతో స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి శిశువును 108 వాహనంలో పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్