తెలంగాణ గ్రాండ్ మాస్టర్, చెస్ స్టార్ అర్జున్ ఇరిగేశి చరిత్ర సృష్టించాడు. 2800 ఎలో రేటింగ్ దాటిన రెండో భారత క్రీడాకారుడిగా అద్భుతమైన ఘనత సాధించాడు. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో పాల్గొన్న అర్జున్.. తన ఐదో రౌండ్‌లో దిమిత్రీ ఆండ్రేకిన్‌ను ఓడించి ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంతకుముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే భారత్ తరపున 2800 ఎలో రేటింగ్‌ను దాటాడు.