దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్‌ జారీ

63చూసినవారు
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్‌ జారీ
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయన ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈకేసు దర్యాప్తులో భాగంగా మూడుసార్లు విచారణకు పిలిచినా యూన్‌ సుక్‌ యోల్‌‌ హాజరుకాలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్