ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 మందికి మాత్రమే ఇళ్లు కేటాయించిందని అరవింద్ తెలిపారు.