మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసు అధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా మహారాష్ట్రలోని హడప్సర్ మగర్‌పట్టా ప్రాంతంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు తొలుత అక్కడ మరో యువకుడిపై గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీరి వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో యువకుడు పోలీసుపై కూడా తిరగబడ్డాడు. అధికారిపై శారీరకంగా దాడి చేశాడు.