ఆషాఢం వచ్చేసింది.. నెలంతా విశేషాలే!

1072చూసినవారు
ఆషాఢం వచ్చేసింది.. నెలంతా విశేషాలే!
తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. వర్షాకాలం రాగానే వచ్చే మాసం ఇది. ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ఆషాడ మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ మాసం ఆ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజించినా మంచి జరుగుతుందని నమ్ముతారు.

సంబంధిత పోస్ట్