తెలుగురాష్ట్రాల్లో చాలామంది రైతులు ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలపై మొగ్గు చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒక్కసారి నాటితే 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుంది. ఒక మొక్క ధర 50 నుంచి 70 వరకు ఉంటుంది. అలాంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను ఎకరానికి 600 నుంచి 700 మొక్కలు పెట్టుకోవచ్చు. అలా ఒక ఎకరంలో దాదాపు లక్ష నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. ఎకరాకు కనీసం ఏడాదికి 2 లక్షల పైగా లాభాలను పొందవచ్చు.