మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే శుక్రవారం ఓ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధాజ్ఞలు ఉన్నా ఉజ్జయిని మహాకాళి ఆలయంలోని గర్భగుడిలోకి శ్రీకాంత్ షిండే ను అనుమతించడంపై వివాదం చెలరేగింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. షిండే థానే జిల్లాలోని కళ్యాణ్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన భార్యతో కలిసి 'గర్భ గృహ' (గర్భగుడి)లోకి ప్రవేశించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.