దేశ రాజధాని ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మంత్రి ఆతిశీ ఎంపికపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిశీ ‘డమ్మీ సీఎం’ అంటూ మండిపడ్డారు. ‘ఢిల్లీకి ఇది విచారకరమైన రోజు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు యత్నించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలి.!’ అని స్వాతి వ్యాఖ్యానించారు.