బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఫోన్ కోసం తమ్ముడిని హత్య చేశాడో అన్న. నిందితుడు బెంగళూరులోని నెరిగ ప్రాంతంలో నివసిస్తున్న ప్రణీష్ ఇంట్లో మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అన్న శివకుమార్ ఫోన్‌ను తనకు తిరిగి ఇవ్వాలని తమ్ముడిని కోరాడు. ప్రణీష్ నిరాకరించడంతో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అన్న శివకుమార్ సుత్తితో తమ్ముడి తలపై పదేపదే కొట్టడంతో కుప్పకూలిపోయి మృతి చెందాడు.