దారుణం.. సెప్టిక్ ట్యాంక్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం

58చూసినవారు
దారుణం.. సెప్టిక్ ట్యాంక్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం
తమిళనాడులో 9 ఏళ్ల బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు. మధురైలోని కథపట్టి గ్రామంలో ఉర్దూ ప్రమోషన్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో ఇన్‌స్టిట్యూట్ వార్డెన్ శనివారం (మే 25) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్