గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఖాన్ యూనిస్ సమీపంలో ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్, వైమానిక దాడుల్లో కనీసం 16 మంది పాలస్తీనియన్లు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. డజన్లు కొద్ది మంది గాయపడ్డారని వెల్లడించారు. ఇజ్రాయెల్ కొన్ని పరిసరాలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. ఆ ప్రాంతాలపై తిరిగి దాడులు కొనసాగిస్తోంది.