ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతినిధి ప్రిస్కా థెవ్‌నోట్‌పై దాడి జరిగింది. జులై 7న కీలక రెండో రౌండ్ ఓటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మాక్రాన్ నేతృత్వంలోని రినైజాన్స్ కూటమి అభ్యర్థి ప్రిస్కా, ఆమె డిప్యూటీ, పార్టీ కార్యకర్తలపై పారిస్ సమీపంలో బుధవారం రాత్రి కొందరు దాడి చేసినట్లు ప్రధాని గాబ్రియేల్ అట్టల్ ఎక్స్‌లో తెలిపారు. ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.