పొడవాటి కత్తితో మహిళపై హత్యాయత్నం.. వీడియో

55చూసినవారు
వీధి వ్యాపారిగా పనిచేస్తున్న మహిళపై ఓ దుండగుడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సదరు మహిళ వ్యాపారం చేసుకుంటుండగా దుండగుడు అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు పట్టుకొని పొడవాటి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్