ఉరి వేసుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

72చూసినవారు
ఉరి వేసుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నార్ఖేడ్ తాలూకాలోని మోవాడ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ టీచర్ విజయ్ పచోరి, ఆయన భార్య మాలాబాయి పచోరి, వారి ఇద్దరు పిల్లలు దీపక్, గణేష్ పచోరి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్