బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటార్నీ జనరల్ అడ్వకేట్ అబు మహ్మద్ అమీన్ ఉద్దీన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈయనను అక్టోబర్ 2020లో న్యాయమంత్రిత్వశాఖ అటార్నీ జనరల్‌గా నియమించింది. ఈయన బంగ్లాదేశ్ 16వ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అమీన్ గతంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారు.