హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వినాయక చవితి రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున చిత్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, బ్రహ్మయోగం, ఇంద్ర యోగంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 7న చిత్త నక్షత్రం మధ్యాహ్నం 12.34 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. దీంతో పాటు ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఆగస్టు 8న మధ్యాహ్నం 12.34 నుంచి ఉదయం 6.15 వరకు ఉంటుంది.