BGT భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను బుమ్రా, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీసి కట్టడి చేశారు. దీంతో ఆస్ట్రేలియా 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో పాట్ కమిన్స్ (0*) అలెక్స్ క్యారీ(8*) ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆసీస్ 245 పరుగుల ఆధిక్యంలో ఉంది.