నార్త్ ఢిల్లీలోని లోహా పుల్ ప్రాంతంలో ఆటోరిక్షా డ్రైవర్ వాహనంలోనే హత్యకు గురయ్యాడు. కాగా, మృతుడి ఫోన్ మాయమవ్వగా అతడి జేబులోని నగదు మాత్రం అలాగే ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాత ఇనుప వంతెన సమీపంలో ఆటోరిక్షాలో ఓ వ్యక్తి శవమై పడి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. మృతుడిని యూపీలోని బదౌన్‌లో నివాసం ఉంటున్న ఇస్లామ్‌గా పోలీసులు గుర్తించారు. దోపిడీ, శత్రుత్వం వంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.