జీవుల మధ్య శృంగారం అనేది ప్రకృతి ధర్మం. సమాజంలోని మనుషులే కాదు, ఇతర జీవులు కూడా ఆ ధర్మాన్ని పాటిస్తాయి. అయితే మనిషి విచక్షణా జ్ఞానం ఉన్నవాడు. తప్పు ఒప్పుల గురించి తెలిసిన వాడు. కనుక ఇతర విషయాల పట్లే కాదు.. శృంగారంలో పాల్గొనే విషయంలోనూ పరిమితి పాటించాలి. కామ వాంఛతో రగిలిపోతూ విచక్షణా జ్ఞానం లేకుండా పిచ్చెక్కిన వారిలా ప్రవర్తించకూడదు. అన్ని విషయాల్లోనూ అతి పనికిరాదన్నట్లే శృంగారం విషయంలోనూ అతి చేయరాదు. అయితే మరి దంపతులు వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది ? ఎన్ని సార్లు పాల్గొనాలి ? అంటే… కిన్సే ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వే ప్రకారం 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఏడాదికి 112 సార్లు శృంగారంలో పాల్గొంటారని వెల్లడైంది. అదే 30 నుంచి 39 ఏళ్ల వారు అయితే 86 సార్లు, 40 నుంచి 49 ఏళ్ల మధ్య వారు అయితే ఏడాదికి 69 సార్లు శృంగారంలో పాల్గొంటారని తేలింది. అయితే వారంలో శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొనాలి ? అనే విషయంపై ఇప్పటికే సైంటిస్టులు గానీ, వైద్యులు కానీ కచ్చితమైన లెక్క చెప్పలేదు. కానీ వారానికి కనీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే బాగుంటుందని, దంపతుల మధ్య సంబంధాలు బాగుంటాయని, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాని తెలిపారు.
అయితే మరి శృంగారంలో అతి చేసినట్లు ఎలా తెలుస్తుంది ? అంటే.. అందుకు ఒక మార్గం ఉంది. అదేమిటంటే..
1. కామవాంఛలు అతిగా వస్తున్నాయా ?
2. శృంగార కోర్కెల మూలంగా ఒత్తిడి కలుగుతుందా ?
3. శృంగార ప్రవర్తన వల్ల జీవిత భాగస్వామితో సంబంధాలు నశిస్తున్నాయా, దాని ప్రభావం ఆఫీసులో చేసే పనిపై పడుతుందా, దాని వల్ల నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయా ?
4. అతి శృంగార ప్రవర్తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని భయపడుతున్నారా ?
పైన తెలిపిన ప్రశ్నలకు మీకు మీరే సమాధానాలు చెప్పుకోండి. వాటిల్లో ఎక్కువ ప్రశ్నలకు అవును అని సమాధానం గనక వచ్చినట్లయితే మీరు అతిగా శృంగారాన్ని కోరుకుంటున్నారని లేదా అతిగా శృంగారంలో పాల్గొంటున్నారని అర్థం. కనుక అలాంటి వారు వెంటనే మానసిక వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇలా శృంగారంలో అతి చేయడాన్ని తగ్గించుకుని జీవితాన్ని హ్యాప్పీగా ఎంజాయ్ చేయవచ్చు.