మహారాష్ట్ర NCP పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అతడు అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా సమాచారం. NCP తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జిశాన్‌ను బరిలో దింపుతున్నట్లుగా పార్టీ వెల్లడించింది. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో బాబా సిద్ధిఖీ హత్యకు గురైన సంగతి తెలిసిందే.