బాలగంగాధర్ తిలక్ 1890లో కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరాడు. కానీ త్వరలోనే తిలక్‌కు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను “ప్రార్థించు, వినతి, నిరసన” చెయ్యడానికే పరిమితమైంది. “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు.” అని తిలక్ ఘాటైన విమర్శలు చేశారు.