కులగణనపై బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు, ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కులగణన చేశారని.. మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.