టీటీడీ బోర్డులో బంజారాలకు అవకాశమివ్వాలి: బలరాం నాయక్

84చూసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో బంజారాలకు అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబును మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కోరారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. హథీరాంజీ మఠానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. వీటి రక్షణకు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్