ధనియాల నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ధనియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు ఇన్సులిన్ చర్యను పెంచుతాయి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ధనియాల నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సమ్మేళనాలు ధనియాల నీటిలో ఉన్నాయి. ఖాళీ కడుపుతో రోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.