తెలంగాణకు బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1 కోటి విరాళం

67చూసినవారు
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1 కోటి విరాళం అందించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ కలిశారు. ఈ మేరకు విరాళం చెక్కును సీఎంకు అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని రేవంత్ అభినందించారు.

సంబంధిత పోస్ట్