నేడు ఆరో రోజు అలిగిన బతుకమ్మ.. విశిష్టత

66చూసినవారు
నేడు ఆరో రోజు అలిగిన బతుకమ్మ.. విశిష్టత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ, నవవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు.

సంబంధిత పోస్ట్