ఒక పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలనూ, కుటుంబ అనుబంధాలనూ బలోపేతం చేయడమే. దీనికి బతుకమ్మను మించిన గొప్ప వేడుక మరొకటి లేదు. చదువు, ఉపాధి, వివాహం, ఉద్యోగం, వలసలు... వంటి కారణాలతో చాలామంది తమ సొంత ఊళ్లు వదిలేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయినా బతుకమ్మ పండుగ సమయానికి మళ్లీ స్వస్థలానికి తిరిగొస్తారు. బంధువులంతా ఒక చోటికి చేరతారు. వీటన్నింటి ద్వారా మానవ అనుబంధాలు మరింత పెరుగుతాయి.