వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి కొన్ని పక్షులు, కీటకాలు రాకూడదని, అలా వస్తే దోషం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో తేనెటీగలు నివాసం ఉండకూడదు. అలా ఉంటే 6 నెలల వరకూ వాస్తు దోషం ఉంటుందట. అలాగే గబ్బిలాలు ప్రవేశిస్తే ఆ ఇంట్లో 15 రోజుల వరకూ దోషం ఉంటుందని, ఇంటిని శుభ్రం చేయాలంటున్నారు. అలాగే కాకులు ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయని పేర్కొంటున్నారు.