"ట్రైనీ వైద్యురాలి మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? కుటుంబ సభ్యులతో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు? క్రైమ్‌సీన్‌లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు, మరి విచారణ పూర్తయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు? మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో, వారికి మృతదేహాన్ని చూపించడంలో గంటలపాటు ఆలస్యం ఎందుకు జరిగింది?" ఇలా వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌పై సీబీఐ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.