విశాఖలో భామాకలాపం 2 చిత్రబృందం సందడి

75చూసినవారు
విశాఖలో భామాకలాపం 2 చిత్రబృందం సందడి
విశాఖలో భామాకలాపం2 చిత్రబృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా రెండేళ్ల క్రితం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వచ్చి మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‍గా వస్తోన్న ‘భామాకలాపం 2’ సినిమా ఫిబ్రవరి 16నుండి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుందని చిత్ర బృందం తెలిపింది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న శరణ్య, సీరత్ కపూర్ లు మూవీలో డబుల్ ఫన్ ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్