డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటనకు బయలుదేరారు. ఈనెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు పర్యటన కొనసాగనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పో తోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాల్లో ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా భట్టి బృందం అమెరికాకు బయలుదేరింది.